Thursday, December 19, 2024

Hyd | ‘మంచు’ కుటుంబంలో ఆరని కుంపటి..

మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి రాజుకుంది. ఈరోజు సాయంత్రం మంచు మనోజ్ ప‌హాడి షరీష్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి త‌న అన్న‌ మంచు విష్ణుపై ఫిర్యాదు చేశాడు. నిన్న (శనివారం) రాత్రి తాను లేని సమయంలో తన తల్లి పుట్టినరోజు వేడుకల పేరుతో విష్ణు ఇంట్లోకి ప్రవేశించాడ‌ని… అదే స‌మ‌యంలో తన అనుచరులతో కలిసి జనరేటర్‌లో చక్కెర కలిపిన డీజిల్‌ను పోశాడని మనోజ్ త‌న ఫిర్యాదులో పేర్కోన్నారు.

దాని వల్ల విద్యుత్ సరఫరాలో భయంకరమైన హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయని చెప్పారు. ఆ సమయంలో ఇంట్లో తన తల్లి, తొమ్మిది నెలల పాప, బంధువులు ఉన్నారని, వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోజ్ తెలిపారు. తన కుటుంబాన్ని హత్య చేసేందుకు విష్ణు కుట్ర పన్నారని మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి విచ‌రాణ జ‌ర‌పాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement