Monday, November 25, 2024

ల‌క్ష్మీ మంచు ‘చిట్టి చిల‌క‌మ్మా’ హ్యాక్..

ల‌క్ష్మీ మంచుకి హ్యాక‌ర్స్ షాకిచ్చారు. మంచు లక్ష్మీకి సంబంధించిన చిట్టి చిల‌క‌మ్మా అనే యూ ట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేశారు. ఈ విష‌యాన్ని ల‌క్ష్మీ మంచు త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఈ యూట్యూబ్ ఛానల్ లోపిల్లలకు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా పాఠాలు బోధిస్తుంటారు. త‌న కుమార్తె విద్యా నిర్వాణ ద్వారా పిల్ల‌ల పెంప‌కం, వారికి చ‌దువు చెప్పే విష‌యాల్లో పాటించాల్సిన ప‌ద్ధ‌తులను వివ‌రిస్తూ వ‌చ్చింది లక్ష్మి. చానెల్ హ్యాక్ అయిన త‌ర్వాత.. తమ యూ ట్యూబ్ అకౌంట్‌ను ఎవ‌రో హ్యాక్ చేశార‌ని, అందులో నుంచి ఏదేని అర్థ ర‌హిత‌మైన స‌మాచారం వ‌స్తే ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, త‌మ టీమ్ సైట్‌ను తిరిగి పొంద‌డానికి ప్ర‌య‌త్నిస్తుంద‌ని తెలిపారు ల‌క్ష్మీ మంచు.

Advertisement

తాజా వార్తలు

Advertisement