కరోనా మహమ్మారి కారణంగా వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తినటానికి తిండి కూడా దొరక్క ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అటువంటి వారికోసం కొంత మంది సినీ ప్రముఖులు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి కూడా కొన్ని కుటుంబాలకు అండగా నిలిచారు. ఇదే విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు మంచు లక్ష్మి. అందరికీ నమస్కారం… ఈ కరోనా కష్ట కాలంలో నేను వ్యక్తిగతంగా హాస్పిటల్స్ లో బెడ్స్‌ను ఏర్పాటు చేసి, మందులను అందించడం లాంటి సేవ కార్యక్రమాల్లో భాగం అయ్యాను.
ఇప్పుడు టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి మరింత సహాయాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ కరోనా చాలా కుటుంబాలను నాశనం చేసిందని మనకు తెలుసు. కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది బిడ్డలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. అందులో వెయ్యి పేద కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబాల్లోని పిల్లలకు సరైన విద్య మంచి వైద్యంతో పాటు వారి అవసరాలకు కావలసిన ఇతర ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలని నిర్ణయించుకున్నాం అంటూ చెప్పుకొచ్చారు మంచు లక్ష్మి.