క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ని టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. ఫేస్ బుక్ లో ఓ వీడియోని పోస్ట్ చేస్తూ… లక్ష్మి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇక మంచు లక్ష్మి కాకుండా ఈ వివాదంలోకి ఆమె భర్త కూతురు ని కూడా తీసుకొచ్చింది.
నా పేరు పంచు లక్ష్మి అంటూ మొదలుపెట్టి మధ్యలో పికుల్ ప్రీత్ సింగ్ అంటూ రకుల్ ని కూడా లాగుతూ షాకింగ్ కామెంట్ చేసింది. డాడీ అంటే నాకు రెస్పెక్ట్ ఉండదు. కానీ మీడియా ముందు వాళ్ళ పేర్లు చెప్పుకుంటేనే మా బతుకు. అందుకే కేవలం మీడియా ముందు మాత్రమే డాడీ గురించి మాట్లాడతా… అంటూ చెప్పుకొచ్చింది.
నాకు పెళ్లి అయినా అవనట్లే… పిల్లలు ఉన్నా లేనట్టే ఎందుకంటే నేను కనలేదు.. బట్ నావే విత్తనాలన్నీ అంటూ మంచు లక్ష్మి స్పూఫ్ వీడియో చేసింది.