టొక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ ను మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి కలిశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మమ్ముట్టి కొచ్చిలోని శ్రీజేష్ ఇంటికి వచ్చారు. శ్రీజేష్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి మనస్ఫూర్తిగా అభినందించారు. శ్రీజేష్ కాంస్య పతకాన్ని చూసిన ముమ్మట్టి సంతోషం వ్యక్తం చేశారు. మమ్ముట్టి రాకతో శ్రీజేష్ నివసించే కాలనీలో సందడి వాతావరణం నెలకొంది. మమ్ముట్టి తన నివాసానికి వచ్చేసరికి శ్రీజేష్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తనకు వ్యక్తిగతంగా అభినందనలు తెలిపేందుకు వచ్చిన ఆ సూపర్ స్టార్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. భారత హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో ఓ పతకం (కాంస్యం) సాధించింది. గత కొంతకాలంగా హాకీలో యూరోపియన్ జట్ల హవా నడుస్తున్న తరుణంలో భారత్ కూడా అదే తరహా ఆటతీరుతో టోక్యోలో అదరగొట్టింది. కాంస్యం కోసం పోరులో పటిష్ఠమైన జర్మనీని మట్టి కరిపించింది.
ఇది కూడా చదవండి: శ్రీశైలం మల్లన్న సేవలో అమిత్ షా..