Saturday, September 7, 2024

Malavika Mohanan | ఎర్ర‌ చీర‌లో క‌వ్విస్తున్న మాళవిక..

మలయాళ చిత్రం పట్టం పోలె తో పదేళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. ఈ అమ్మడు తమిళం, మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. చాలా రోజులుగా ఈ అమ్మడు టాలీవుడ్‌ లో కూడా సినిమాలు చేయాలని ఆశ పడుతోంది. ఎట్టకేలకు ఈ అమ్మడు టాలీవుడ్‌ కోరిక తీరబోతుంది.

ఇప్పటికే ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా సాబ్‌ సినిమాలో హీరోయిన్‌ గా ఎంపిక అయ్యింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్‌ పాత్ర కి సంబంధించిన పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ విషయాలు పక్కన పెడితే రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది.

తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలతో రెచ్చి పోయింది. ఈసారి చీర కట్టు తో కుర్రకారు గుండెళ్లో డప్పు మోగించింది. ఈ స్థాయి అందంను ఇన్నాళ్లు టాలీవుడ్‌ ప్రేక్షకులు మిస్‌ అయ్యారు అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రెడ్‌ చీర లో నడుము కనిపించి కనిపించకుండా, నాభి అందాలతో కవ్విస్తున్న మాళవిక మోహనన్‌ అందంకు ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement