Saturday, January 4, 2025

Malavika Mohanan | దుబాయ్ ఫ్యాష‌న్ షోలో మాళ‌విక‌..

మలయాళ చిత్రం పట్టం పోలె తో పదేళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. ఈ అమ్మడు తమిళం, మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. చాలా రోజులుగా ఈ అమ్మడు టాలీవుడ్‌ లో కూడా సినిమాలు చేయాలని ఆశ పడుతోంది.

ఎట్టకేలకు ఈ అమ్మడు టాలీవుడ్‌ కోరిక తీరబోతుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో నటిస్తోంది. ఆమెకి ఇదే తొలి తెలుగు చిత్రంమారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్‌ పాత్ర కి సంబంధించిన పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆ విషయాలు పక్కన పెడితే రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు అందాల ఆరబోత కాస్త ఎక్కువే.. ఇటీవ‌ల దుబాయ్ కు వెళ్లిన అమ్మ‌డు అక్క‌డ జ‌రిగిన ప్యాష‌న్ షో అందాల జాతర చేసింది. ఆ ఫోటోల‌ను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.. పేరుకే లెహంగా కానీ, అమె అందాల‌ను మాత్రం ఈ డ్ర‌స్ దాచ‌లేకోపోవ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement