Wednesday, January 1, 2025

Dileep Shankar | హోటల్ గదిలో శ‌వ‌మై క‌నిపించిన‌ మలయాళ నటుడు

మలయాళ బుల్లితెర-వెండితెర నటుడు దిలీప్ శంకర్ తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్ గదిలో శవమై కనిపించడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితం హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్న‌ దిలీప్ శంకర్… అప్పటి నుంచి బయటకు రాలేదని సమాచారం.

ఈరోజు గదిలో నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది గదిని తెరిచి చూడగా దిలీప్ శంకర్ శవమై కనిపించారు. స‌మాచారం అందుకున్న‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేప‌ట్టారు. ఫోరెన్సిక్ బృందం గదిని తనిఖీ చేస్తోందని కన్వెన్షన్ ఎస్పీ తెలిపారు. అయితే దిలీప్ శంకర్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement