Saturday, September 21, 2024

వెంకీ కుడుముల తో మహేష్ బాబు సినిమా!!

ఛలో సినిమా తో దర్శకుడిగా పరిచయమయ్యాడు వెంకీ కుడుముల. అలాగే గతేడాది నితిన్ హీరోగా వచ్చిన భీష్మ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పని చేయబోతున్నారు. అయితే ఆ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేయట్లేదు. ఇటీవల జాతి రత్నాలు సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి హీరోగా వెంకీ కుడుముల సినిమా చేయబోతున్నాడు.

కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంను సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించబోతున్నారట. అయితే ఈ విషయంపై అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు. క్లారిటీ రావాలంటే మాత్రం ఎవరో ఒకరు స్పందించాల్సిందే. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement