Thursday, September 12, 2024

Mahesh Babu | అనంత్ పెళ్లి వేడుకలో సూపర్ స్టార్.. న్యూ లుక్ వైరల్

ఇక అనంత్‌ అంబానీ – రాధికా మర్చెంట్‌ వివాహానికి ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా ప్రాంతంలోని జియో వరల్డ్‌ సెంటర్‌ వేదికైంది. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు, క్రీడా ప్రముఖులు అతిథులుగా తరలివస్తున్నారు.

తాజాగా ఈ వేడుకలో తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత సందడి చేశారు. మహేష్ కొత్త స్టైల్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మహేష్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి సమయం ఆసన్నమైంది. గత ఏడు నెలలుగా జరుగుతున్న ఈ పెళ్లి వేడుక ఈరోజు ముఖ్యమైన ‘శుభ వివాహ’తో ప్రారంభమై… 13న ‘శుభ్‌ ఆశీర్వాద్‌’, 14న ‘మంగళ్‌ ఉత్సవ్‌’తో ముగియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement