సితార ఈ పేరు తెలియని వారు ఉండరేమో. ఎందుకంటే టాలీవుడ్ సూపర్ స్టార్ ముద్దుల తనయగానే కాదు తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది ఈ చిన్నారి. తొమ్మిదేళ్ల వయసులోనే ఓ యూట్యూబ్ ఛానెల్ ని సొంతంగా ఏర్పాటు చేసుకుంది. చదువు ఒక్కటే కాదు సింగింగ్, డ్యాన్స్ లతో మల్టీ టాలెంటెడ్ సితార. కాగా సితార తన ఫ్రెండ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఓ యూట్యుబ్ ఛానల్ ను నిర్వహిస్తోంది. ఆద్య-సితార యూట్యూబ్ ఛానల్ లో ట్రావెలింగ్ స్టోరీస్, ఛాలెంజస్, గేమ్స్ వంటి అనేక వీడియోలు షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంది.
తమ ఫ్యామిలీ తో కలిసి వెళ్ళిన విదేశాలకు సంబంధించిన మంచి మంచి ప్రదేశాలను కూడా తన ఛానల్ లో పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలారిస్తోంది. ప్రిన్స్ మహేష్ తనయ ప్రిన్సెస్ సితార తాజాగా తనలో టాలెంట్ ను అభిమానులకు పరిచయం చేస్తూ.. ఓ వీడియో ని తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసింది. వాటర్ కలర్స్ తో విండో పెయింటింగ్ ఎలా వేయాలి అనేది ముద్దు ముద్దు మాటలతో క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో వివరించింది సితార. ఈ పెయింట్ ని వేయడానికి కావాల్సిన వస్తువులను కూడా ప్ల్యూయంట్ ఇంగ్లీష్ లో తెలిపింది. సితార చెప్పిన విధానం పలువురుని ఆకట్టుకుంది. తండ్రికి తగ్గ కూతురనిపించుకుంటోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..