Thursday, September 26, 2024

SSMB29 | మ‌హేష్, రాజ‌మౌళి మూవీ షూటింగ్ ఎప్పుడో..

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ రూపొందనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ జిమ్ కు వెళ్లి కష్టపడి తనను తాను మొత్తం మార్చుకుంటున్నారు. అంతేకాకుండా ఈ లోగా తన ఫ్యామిలీని తీసుకుని మహేష్ ఫారిన్ హాలిడే ట్రిప్ సైతం వేసేసారు. అయితే మహేష్ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. ఎందుకు లేటవుతోంది. ఎప్పటినుంచి మొదలవుతుందో చూద్దాం.

వాస్తవానికి జూన్ నుంచి షూటింగ్ మొదలు అయ్యేలా ప్లాన్ చేసారు. అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. లొకేషన్ హంట్ బాగా లేటైంది. ఈ క్రమంలో ఆగస్ట్ లేదా సెప్టెంబర్ కు షూట్ మొదలెడతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు డిసెంబర్ వరకూ షూట్ వాయిదా పడిందని తెలుస్తోంది. డిసెంబర్ రెండవ వారంలో ఈ చిత్రం షూట్ ని రాజమౌళి కూల్ గా మొదలు పెట్టనున్నారట. అదీ కాకపోతే కొత్త సంవత్సరంలోనే. అయితే ఎందుకు లేటు అవుతోంది. ప్లాన్స్ ఎందుకు తారు మారు అయ్యాయి.

ప్రస్తుతం రాజమౌళి స్క్రిప్టు లాక్ చేసి లొకేషన్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. అలాగే మహేష్ బాబు రెండు పెద్ద వర్క్ షాప్ లకు హాజరు కానున్నారు. అవి రెండు నెలలు పైగానే పడతాయంటున్నారు. ఈ వర్క్ షాప్ లో మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ నుంచి మొత్తం మార్చి ప్రాక్టీస్ చేయస్తారని స‌మాచారం.. మహేష్ ..వర్క్ షాప్ లకు హాజరు కావటం అనేది ఇదే తొలి సారి అంటున్నారు. దాంతో ఆయన కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement