ఇండియాలోనే బెస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఎస్.ఎస్.రాజమౌళి కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌ను ఎస్‌ఎస్ రాజమౌళి ప్రకటించారు. జాతీయ పురస్కార గ్రహీత నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ బయోపిక్‌కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
ఈ సినిమాకి ‘మేడ్ ఇన్ ఇండియా’ అని పేరు పెట్టగా.. ట్విట్టర్‌లో SS రాజమౌళి కొత్త సినిమాని ప్రకటిస్తూ టీజర్‌ను పంచుకున్నారు. కథ, కథనాలతో పాటు విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయని సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా అర్థం అవుతోంది. ‘ఫిల్మిస్తాన్’, ‘మిత్రన్’, ‘నోట్‌బుక్’, ‘జవానీ జానేమన్’ వంటి చిత్రాలకు నితిన్ కక్కడ్ దర్శకత్వం వహించారు.
‘మేడ్ ఇన్ ఇండియా’ మూవీని ఆరు భాషల్లో విడుదల చేయనున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీలో ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతుండగా, నటీనటుల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ సినిమా టీజర్ మాత్రం ‘మేడ్ ఇన్ ఇండియా’పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేసింది.