Saturday, November 23, 2024

‘మా’ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల..

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (2021 – 2023) ఎన్నికల నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. అక్టోబర్‌ 10న (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్‌ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎన్నికల్లో ఎనిమిది మంది ఆఫీస్‌ బేరర్స్‌, 18మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్స్‌ కోసం జరిగే ఈ ఎన్నికలకు ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. కాగా ఈనెల 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్‌ ఉపసంహరణకు వచ్చే నెల 1 నుంచి 2వ తేది సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఉంటుంది. అక్టోబర్ రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అక్టోబర్‌ 10న ఎన్నికలు, అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు. కాగా ఒక అభ్యర్థి ఒక పోస్ట్‌ కోసమే పోటీ చేయాల్సి ఉంటుందని ఎన్నిలక అధికారి తెలిపారు. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్‌లకు హాజరు కాకపోతే పోటీ చేసే అర్హత ఉండదు. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు.

ఇక గ‌త కొన్నివారాలుగా మా ఎన్నిక‌ల టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్, సీవీఎల్ న‌ర‌సింహారావు, మంచు విష్ణు పోటీలో దిగుతున్న‌సంగ‌తి కూడా తెలిసిందే. అయితే వీరిలో ముందు నుండి ప్ర‌కాష్ రాజ్ దూకుడు గా వ్యవ‌హరిస్తున్నారు. ఇక మంచు విష్ణు మా బిల్డింగ్ అనే స్లోగ‌న్ తో ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నారు. ప్ర‌కాష్ రాజ్ చాలా హామీల‌ను ఇచ్చారు. సీవీఎల్ న‌ర‌సింహారావు తెలంగాణ ఆర్గ్యుమెంట్ తో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు.

ఇది కూడా చదవండి: ఎవరు మీలో కోటీశ్వరులు షోకి రాజమౌళి, కొరటాల శివ.. !

Advertisement

తాజా వార్తలు

Advertisement