ప్రదీప్ రంగనాథన్ నటిస్తూ, దర్శకత్వం వహించిన తమిళ మూవీ లవ్ టుడే.. మూడు వారాల క్రితం తమిళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం ఐదు కోట్ల బడ్జెత్‌తో తెరక్కిన ఈ మూవీ 60 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ సినిమాను అదే పేరుతో నిర్మాత దిల్‌రాజు తెలుగులోకి డబ్ చేశారు. గత శుక్రవారం (నవంబర్ 25న) థియేటర్లలో విడుదలైన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్కు ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేమకథకు కామెడీని జోడించి ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు ప్రదీప్. ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడీగా ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. సత్యరాజ్, రాధికా, యోగిబాబు కీలకపాత్ర పోషించారు. ఇదిలా ఉండగా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న లవ్‌టుడే సినిమా అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లవ్‌టుడే డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. దీనికోసం భారీగానే డబ్బులు చెల్లించిందట. కాగా, డిసెంబర్ 2న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలుగులో విడుదలైన మొదటి రోజే ఈ సినిమా రూ.2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. శనివారం కూడా కోటికిపైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇలా వసూళ్లు పెరుగుతున్న తరుణంలో ఓటీటీ రిలీజ్ డేట్ విడుదల చేయడం దిల్‌రాజుకు షాకింగ్ కలిగించే విషయమే అంటున్నారు అనలిస్టులు.