Friday, November 22, 2024

Look Out Notices | యూట్యూబర్‌ హర్షసాయిపై లుక్‌ అవుట్‌ నోటీసులు

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : యూట్యూబర్‌ హర్షసాయిపై నార్సింగి పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు పరారీలో ఉన్న అతడిని పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. యూట్యూబర్‌ హర్షసాయి విదేశాలకు పారిపోకుండా లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

హర్షసాయి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని సైబరాబాద్‌ సీపీకి బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హర్షసాయి విదేశాలకు పారిపోకుండా లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. హర్షసాయిపై గత నెలలో అత్యాచారం కేసు నమోదైంది.

తనపై అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలు సేకరించి బ్లాక్‌ మెయిల్‌ చేశాడని, మెగా సినిమా కాపీ రైట్స్‌ కోసం తనపై లైంగిక దాడి చేశాడని బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు కావడంతో హర్షసాయి పరారీలో ఉన్నాడని, ఈక్రమంలో బెంగళూరులో తలదాచుకున్న నిందితుడు విదేశాలకు వెళ్లిపోకుండా లూక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement