హీరోయిన్గా మంచి విజయాలు తన ఖాతాలో వేసుకన్న నటి అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు ఎక్కు వ చిత్రాల్లో నటిస్తున్న నటి కూడా ఈమెనే. ఈ భామ ‘రౌడీ బాయ్స్’తో ఆక ట్టుకుని, ‘కార్తి కేయ 2’ తో తన సత్తా చాటుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన చిత్రమిది. నిఖిల్ , అనుపమ జంటగా నటించారు. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన కార్తికే య 2 చిత్రాన్ని టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. గతవారం థియేటర్స్ లలో విడుదలై విజయ వంతంగా రన్ అవుతున్న సందర్బంగా హీరోయిన్ అనుపమ పాత్రికేయులతో మాట్లాడుతూ పలు అంశాలు వెల్లడించారు.
కార్తికేయ చిత్రానికి ప్రేక్షకులనుండి మంచి స్పందన వస్తోంది. నా పాత్రను ప్రశంసిస్తున్నారు. ఇది నాకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమా చూసి న బాగుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు చందు మొండేటి ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యి ఈ సినిమా చేద్దాం అనుకున్నాను. ప్రతి కథకు కంటెంట్ అనేది చాలా ముఖ్యం చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమీ ఉండదు మనుషుల్లో ఉన్న మంచి తనాన్ని నేను దైవంగా బావిస్తాను.ఈ సినిమాలో కృష్ణతత్వం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది.
తరచుగా లొకేషన్స్ మారుతూ షూటింగ్ చేయడంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాగే మంచు గడ్డ కట్టే ప్రదేశంలో షూటింగ్ చేయడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందరూ జేమ్స్ బాండ్ టైప్ లో ఎంట్రీ ఇచ్చావు అంటున్నారు అలాగే కొన్ని చోట్ల హీరో ను డామినేట్ చేసే విధంగా నా పాత్ర ఉంది అనడంలో వాస్తవం లేదు. అయితే కథకు తగినట్టుగానే నా పాత్ర ఉంటుంది. నేను ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాను. నాకొచ్చే పాత్రలు ఛాలెంజింగ్ ఉండాలి అలాంటివి నాకు నచ్చుతాయి. ఒక ఆర్టిస్ట్‌గా ఎక్కువ భాషల్లో నటించాలని ఉంది. దానివల్ల నాకు నిర్మాతకు, దర్శకులకు కూడా స్పాన్ పెరుగుతుంది.
కార్తికేయ తదుపరి పార్టులో నా పాత్ర ఉంటుందో లేదో తెలియదు. దాని గురించి ఇంకా స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం నేను నటిస్తున్న రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. మరో రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. అలాగే 18 పేజెస్ సినిమా వారం రోజుల షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉంది.. అంటూ చెప్పుకొచ్చింది అనుపమ..