దక్షిణాదిలో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరుతెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. కేవలం 5 సినిమాలతో బాక్సఫీస్ వద్ద తన సత్తా ఏమిటో చూపించాడు. ‘మానగరం’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన లోకేష్ ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్లు అందించాడు. కాగా, ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు లోకేష్. తాను కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. ‘జీ స్క్వాడ్’ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా లోకేష్ కనగరాజ్ ప్రకటించాడు.
కొత్తగా సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చి కథలు రెడీ చేసిన వారికి తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా అవకాశం కల్పించనున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. అయితే మొదట తన స్నేహితులు, సన్నిహితులతో పాటు అసిస్టెంట్లకు అవకాశాలు కల్పించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన ప్రొడక్షన్ హౌస్ నుంచి రానున్న ఫస్ట్ అప్డేట్ కోసం ఎదురు చూడాలని సూచించారు. ఇక, ఎప్పటిలాగే అందరూ తనకు సహకారం అందించాలని లోకేష్ కనగరాజ్ కోరారు.