Sunday, September 22, 2024

Double ismart | డ‌బుల్ ఇస్మార్ట్ కు లైగ‌ర్ సెగ‌..

డబుల్ ఇస్మార్ట్ మరో రెండు రోజుల్లో రిలీజ్ కు రెడీ గా ఉంది. కానీ ఇప్పటికి లైగర్ నష్టాల వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుందా అన్న సందేహం వస్తోంది. దాదాపు రెండు వారాల క్రితం మొదలైన పంచాయతీ డైలీ సీరియల్ లా కొనసాగుతూనే ఉంది తప్ప కొలిక్కి రావట్లేదు.

లైగర్ నష్టపరిహారం విషయమై అప్పట్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వెళ్తే సాఫీగా జరిగిపోయేది ఈ వ్యవహారం. కానీ ఆలా కాకుండా అనేక మెలికలు పెడుతున్నారు అనేది డిస్ట్రిబ్యూటర్ల వాదన. నిన్నటి వరకు జరిగిన సెటిల్ మెంట్ ప్రకారం లైగర్ ను నైజాంలో పంపిణీ చేసిన బయ్యర్స్ కు 40 శాతం నష్టాలు భరించేందుకు ముందుకు వచ్చారు ఆ సినిమా నిర్మాతలైన ఛార్మి, పూరి జగన్నాధ్.

ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇందుకు ఇరువురిని ఒప్పించారు. కానీ చివరి నిమిషంలో నిర్మాతలు వెనక్కితగ్గారని తెలిసింది. పర్సెంటేజ్ ప్రకారం కాకుండా రూ. 6 కోట్లు ఇస్తామని ఛార్మి మరో మాట చెప్పినట్టు వినిపిస్తోంది. ఎవరో ఒకరు ఎక్కడో అక్కడో తగ్గితే ఈ డీల్ తెగుతుంది కానీ ఎవరికీ వారు మొండిపట్టు పట్టారు.

మాకు ఇస్తామని చెప్పింది ఇవ్వకుంటే డబుల్ ఇస్మార్ట్ ను నైజాం లో బాయ్ కాట్ చేస్తామని చిన్నపాటి హెచ్చరిక జారీ చేసారు నైజాం డిస్ట్రిబ్యూటర్లు. అదే జరిగితే డబుల్ ఇస్మార్ట్ నిండా మునిగిపోతుంది. వాస్తవానికి డబుల్ ఇస్మార్ట్ నైజాం థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసి, డిస్ట్రిబ్యూషన్ కోసం మైత్రీ దగ్గర ఉంచారు హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి.

జరుగుతున్న రచ్చ చూసి మైత్రీ మనకెందుకు అన్నట్టు ఉంది. ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో సినీపెద్దల సమక్షంలో జరగబోయే భేటీలో ఏదో ఒకటి ఫిక్స్ అవుతుందని ఎదురుచూస్తున్నారు. కాగా డబుల్ ఇస్మార్ట్ ను నైఙాం ఏరియాలో ఆసియన్ సురేష్ సంస్థ పంపిణీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆసియన్ సురేష్ థియేటర్స్ లో డబుల్ ఇస్మార్ట్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement