కోలీవుడ్ హీరో ధనుష్‌పై తమిళ చిత్రపరిశ్రమ రెడ్‌కార్డ్ ప్రకటించారు. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జులైలో ఒక తీర్మానం కూడా చేసింది. నవంబర్ 1 నుంచి ధనుష్‌తో సినిమాలు చేసేది ఉండదని కఠినమైన నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో కోలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగింది.
రెమ్యునరేషన్ తీసుకుని షూటింగ్‌కు సహరించని నటీనటులకు తమిళ ఇండస్ట్రీ రెడ్‌కార్డులు జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జులైలో ధనుష్‌పై రెడ్‌కార్డ్ జారీ అయింది. త్రేండల్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్ నుంచి సినిమాలు చేసేందుకు ధనుష్ అడ్వాన్స్ తీసుకున్నారట.
అయితే, ఎన్ని సంవత్సరాలైనా షూటింగ్‌కు డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ నిర్మాణ సంస్థలు తమిళ నిర్మాత మండలిని ఆశ్రయించింది. దీంతో ధనుష్‌పై రెడ్ కార్డ్ జారీ చేస్తున్నట్లు గతంలో తెలంగాణ చిత్ర పరిశ్రమ పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశంపై ధనుష్‌తో చర్చలు జరిగినట్లు సమాచారం.
ధనుష్ తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా ఫైవ్ స్టార్ క్రియేషన్స్‌కి తిరిగి చెల్లిస్తాడని ఆపై త్రేండల్ ఫిల్మ్స్‌తో సినిమా చేయడానికి ధనుష్ అంగీకరించాడని నివేదికలు అందుతున్నాయి. దీంతో ఇదే విషయాన్ని రెండు ప్రొడక్షన్ హౌస్‌లు ఫిల్మ్ ఫెడరేషన్ కు తెలిపాయని సమాచారం. దీంతో కొన్ని షరతులపై ధనుష్ మీద ఉన్న రెడ్ కార్డ్ రద్దు చేశారు.