కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ లియో. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 600 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్‌ను అధిగమించి 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది.
అయితే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం, లియో సినిమాని తమిళనాడు అంతటా 100కి పైగా స్క్రీన్లలో రీ-రిలీజ్ చేనున్నారట మేకర్స్. రీ రి-లీజ్ ప్లాన్ వెనుక కారణం… తమిళనాడు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించగల మంచి సినిమాలు ఏమీ లేకపోవడమే అని తెలుస్తోంది. 5వ వారంలో కూడా లియో బాక్సాఫీస్ వద్ద మంచి రన్‌ను కొనసాగిస్తోంది. ఇక ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించగా… లలిత్ కుమార్ నిర్మించారు. ఈ మూవీ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.