తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘‘లియో’’. లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. భారీ అంచనాలతో దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్‌గా విడుదలైంది. మొదట రెండు రోజులు ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపించినా.. ఆ తర్వాత మంచి వసూళ్లను రాబడుతోంది. విజయ్ కెరీర్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొట్ట మొదటి సారిగా 20 కోట్ల షేర్ మార్క్ అందుకుని కేక పెట్టించింది ఈ సినిమా.
కాగా, ఈ మూవీ ఓటీటీకి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా వచ్చే నెల (నవంబర్) 21న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఇక అన్ని భాషలకు కలిపి లియో డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రైట్స్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో విడుదలకు ముందే ఓ సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అనిరుద్ సంగీతం అందించగా.. 7 స్క్రీన్ స్టూడియోస్ నిర్మించింది.