గుండెపోటుతో మరణించారు లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా అన్న కుమారుడు పావళర్.ఆయన వయసు 60ఏళ్లు.ఇళయరాజా అన్నయ్య, పావళర్ శివన్ తండ్రి పేరు పావళర్ వరదరాజన్.. ఆయన కూడా గొప్ప సంగీత దర్శకుడు.. అంతే కాదు పాటల రచయిత.. మంచి గాయకుడిగా కూడా పనిచేశారు. ఇళయరాజా లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం వరదరాజన్ పాత్ర చాలా ఉందని కుటుంబ సభ్యులు చెబుతూ ఉంటారు. అంతే కాదు ఇళయరాజాని ముఖ్యంగా ఇండస్ట్రీలో ప్రోత్సహించింది ఆయనే నట. 1973లోనే వరదరాజన్ మరణించాడు. ఇక ఆయనకు ఇద్దరు కుమారులు కాగా ఒక కొడుకు 2020లో కిడ్నీ సమస్య కారణంగా మరణిస్తే ఇప్పుడు రెండవ కొడుకు శివన్ కూడా గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.
ఇకపోతే శివన్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురి కావడంతో మంచం మీద నుంచి పడిపోయినట్లు తెలుస్తోంది.దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. శివన్ మంచి గిటార్ వాయిద్య కారుడు ఆయన ఇళయరాజా మ్యూజిక్ టీంలోనే కొనసాగుతూ వచ్చారు. సంగీత దర్శకుడిగా కూడా రెండు మూడు చిత్రాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ సక్సెస్ కాలేదు. ఇక శివన్ కుటుంబ సభ్యులతో పాటు పాండిచ్చేరిలో ఉంటున్నారు. ఇక ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర సోకసంద్రంలో మునిగిపోయారు. అంతేకాదు తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా శివన్ మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.