తన పాన్ ఇండియా మూవీ కంగువ గ్లిప్స్ తో తన ఫ్యాన్స్ లో హైప్ క్రియేట్ చేసిన కోలీవుడ్ స్టార్ సూర్య.. తాజాగా, ఒక సమావేశంలో తన అభిమానులను కలిశారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తను మరో సినిమా చేయనున్న ప్రకటించాడు. LCU(లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) లో భాగంగా లోకేష్ కలిసి పని చేయనున్నట్టు.. ఈ అప్ కమింగ్ ప్రజెకట్ 2022 వచ్చిన విక్రమ్ మూవీలో పరిచయం చేయబడిన రోలెక్స్ పాత్రపై ఆధారంగా ఉంటుందని అని అభిమానుల సమావేశంలో వెల్లడించారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్‌ను లోకేష్ కనగరాజ్ ఇప్పటికే తనకు వినిపించారని సూర్య చెప్పారు.
LCU ఎప్పటికప్పుడు విస్తరిస్తోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ 2019లో కైతితో LCUని ప్రారంభించాడు. ఈ మూవీలో అర్జున్ దాస్, కార్తీ నటించారు. ఆ తర్వాత దర్శకుడు కమల్ హాసన్‌తో విక్రమ్ (2022)ని విడుదల చేశాడు. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాని విజయం తర్వాత, దర్శకుడు ఇప్పుడు తలపతి విజయ్‌తో లియో తో రానున్నాడు. అయితే, లియో కూడా LCUలో భాగమవుతుందని వార్తలు వచ్చాయి.. కానీ మూవీ యూనిట్ నుండి అధికారిక ధృవీకరణ లేదు.
కాగా, ఇప్పుడు సూర్య నుండి వచ్చిన తాజా సూచన ప్రకారం, లియో తర్వాత లోకేష్ తదుపరి మూవీ రోలెక్స్ తో ఉండబోతుందని తెలుస్తోంది.