భారతదేశ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి సొంతంగా ఓ ఓటీటీ యాప్ వేవ్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వినియోగదారులు టీ-వీ, రేడియో ప్రొగ్రాంలను మోబైల్ ద్వారా అందుకునే వీలున్నది. ప్రస్తుతం వేవ్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో 40 ఛానల్స్ అందుబాటులో ఉన్నాయి.
గోవాలోని పనాజీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ ఈ విషయాన్ని వెల్లడించారు. క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్-టైన్‌మెంట్ ఇవ్వడానికి వేవ్స్ ఓటీటీ యాప్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ఓఎన్‌డీసీ నెట్‌వర్క్, గేమ్‌లు, సినిమాలతోపాటు- వార్తలు, ఈసీ షాపింగ్ వంటి సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నట్లు సెహగల్ తెెలిపారు.