గతంలో పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలించింది. ఈ బ్లాక్ బస్టర్ కాంబో తిరిగి మరో ప్రాజెక్ట్ చేయడానికి ఒక దశాబ్దం కంటే ఎక్కువ సమయం పట్టింది. కాగా వీరి కాంబినేషన్ లో వస్తున్న కొత్త మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ సినిమాకి సంబంధించి హైదరాబాద్లో భారీ సెట్ వేసారు. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల (ఏప్రిల్) 5న ప్రారంభం కానుంది.
తొలిరోజు షూటింగ్ కు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. మూవీకి సంబంధించన షార్ట్ షెడ్యూల్ ఐదు రోజుల పాటు యాక్టివ్గా ఉంటుంది. ఇక సినిమాలో శ్రీలీల, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే, మూవీ ఆలస్యంగా ప్రారంభం కావటంతో, పూజా హెగ్దే ఇంకా కాల్ షీట్లను అందించలేదు. ఆమెతో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు.