Monday, November 18, 2024

Kusha Kapila: డేటింగ్ లో కుషా క‌పిల‌..

బాలీవుడ్ నటి ‘కుషా కపిల’ సోషల్ మీడియాతో విపరీతమైన స్టార్‌డమ్‌ తెచ్చుకున్నారు. కామెడీ కంటెంట్‌తో చిన్న చిన్న వీడియోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఆ తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌‍ల్లోనూ నటించారు. అనంతరం 2017లో కుషా కపిల.. జోరావర్ సింగ్ అహ్లువాలియాను పెళ్లి చేసుకున్నారామె. అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2023లో విడిపోయారు.

బాలీవుడ్‌ జంట కుషా కపిల, జొరావర్‌ సిగ్‌ అహ్లువాలియా విడిపోయిన తర్వాత వారి అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఆమెపై కొందరు తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. ఆమె క్యారెక్టర్‌ను తప్పు పడుతూ అసభ్య రీతిలో కామెంట్లు కూడా చేశారు. దీంతో అదే సమయంలో ఆమె భర్త జొరావర్‌ సిగ్‌ అహ్లువాలియా కలుగచేసుకుని ఆమెపట్ల ఇలాంటి కామెంట్లు వద్దని వారించాడు. ఇద్దరం కలిసే విడిపోయాం. ఇందులో ఆమెది మాత్రమే తప్పు కాదు అంటూ చెప్పడంతో ఆమెపై వస్తున్న విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పడింది.

- Advertisement -

తాజాగా ఆమె గురించి బాలీవుడ్‌ వర్గాల్లో ఒక రూమర్‌ క్రియేట్‌ అయింది ఇటీవల, ఆమె ప్రముఖ బాలీవుడ్‌ కమెడియన్‌తో డేటింగ్‌పై పుకార్లు వచ్చాయి. ఆమె హాస్యనటుడు అనుభవ్ సింగ్ బస్సీతో ప్రేమాయణం సాగిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ విహారయాత్రలో భాగంగా గోవాలో చక్కర్లు కొడుతున్నారని వార్త‌లు వ‌చ్చాయి. కుషా, బస్సీ మధ్య రిలేషన్‌పై నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో చాలా సందర్భాలలో వారిద్దరూ కలిసి కనిపించారని ఒక నెటిజన్‌ చెప్పారు. భర్తకు విడాకులిచ్చి సంవత్సరం కూడా కాలేదు.. అప్పుడే మరోకరితో రిలేషన్‌ పెట్టుకుని ఎంజాయ్‌ చేయడం ఏంటి..? కొంచమైనా సిగ్గుగా లేదా..? అంటూ పదునైన విమర్శలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement