Tuesday, July 2, 2024

KurmaNayaki | పవర్‌ఫుల్‌ రోల్‌తో శివాజీ కమ్‌ బ్యాక్

నటుడిగా శివాజి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన 90మిడిల్‌ క్లాస్‌ అనేవెబ్‌ సిరీస్‌లో నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన ‘కూర్మనాయకి` అనే చిత్రంలో నటిస్తున్నారు. నేడు శివాజీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రని పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్‌.

భారీ సోషియో ఫాంటసీగా కూర్మనాయకి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్ తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కె విజితా రావ్ నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రానటువంటి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, సాయి కుమార్, అతిరారాజ్, వీటీవీ గణేష్ కీ రోల్స్ లో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement