Thursday, October 24, 2024

Kriti Sanon | ఆ అందంతో ఆదిపురుష్ కు గాలం…

కృతి సనన్ మొదటి సినిమానే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నేనొక్కడినే చిత్రంలో చేసింది. అయితే ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. సినిమాలో కృతి సనన్ కి మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. తరువాత హీరోపంతి సినిమాతో కృతి బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

ఆ సినిమా హిట్ అయ్యింది. మరల తెలుగులో దోచేయ్ సినిమాలో నాగ చైతన్యతో జతకట్టింది. ఆ మూవీ వర్క్ అవుట్ కాలేదు. హిందీలో చేసిన రెండో సినిమా దిల్ వాలే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన కృతి సనన్ కి తరువాత వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి.

సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లలో ఒకరుగా కృతి దూసుకుపోతోంది. గత ఏడాది ఆదిపురుష్ తో డిజాస్టర్ అందుకున్న ఈ బ్యూటీ 2024లో మాత్రమే తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా, క్రూ సినిమాలతో రెండు హిట్స్ అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసింది. ఈ మ్యాగజైన్ పై డార్క్ బ్లూ కలర్ అవుట్ ఫిట్ తో కృతి సనన్ లుక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయనే మాట వినిపిస్తోంది.

ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్ళ కలల దేవతలా ఈ రూపంలో కృతి సనన్ ఉందనే మాట సౌషల్ మీడియాలో వినిపిస్తోంది. ఆదిపురుష్ మూవీ డిజాస్టర్ కాకుండా ఉండుంటే నెక్స్ట్ పాన్ ఇండియా హీరోయిన్ గా కృతి సనన్ మారేదనే ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement