మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ సారి పోటీకి మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, ప్రకాష్ రాజ్, నటి హేమ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే దీనిపై ఇప్పుడు కృష్ణంరాజు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే కృష్ణంరాజు ప్రస్తుత కౌన్సిల్ తో పాటు రాబోయే ఎన్నికల విషయమై పోటీదారుల తో సమావేశం అవుతారట.
ప్రస్తుత అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ సరిగాలేదని ఈ వివాదాల వెనుక ఇదే కారణమని కృష్ణంరాజుకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కు లేఖ రాసింది. దీన్ని పరిగణలోకి తీసుకొని కృష్ణంరాజు మా సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక ఎన్నికలు సెప్టెంబర్ నెలలో జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.