Friday, November 22, 2024

ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. దేవరపై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన కొరటాల..!

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. 300 కోట్ల భారీ బడ్జెట్‍తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తొండ‌గా.. సైఫ్ అలీఖాన్ విలన్‍గా నటిస్తున్నారు. కాగా, మూవీకి సంబంధించిన అప్డేట్ ని రివీల్ చేశారు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌.

- Advertisement -

“దేవర సినిమా గురించి ఓ ముఖ్యమైన విషయాన్ని చెప్పేందుకు మీ ముందుకు వచ్చా. దేవర సినిమా కథ రాసుకున్నప్పుడు, ఎన్టీఆర్‌కు చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాం. ఎందుకంటే కొత్త ప్రపంచం, భారీతనం, చాలా బలమైన పాత్రలు, భావోద్వేగాలు ఈ సినిమాలో ఉంటాయి. ఆ ఆత్మవిశ్వాసంతో షూటింగ్ మొదలుపెట్టాం. అయితే, ఆ ప్రపంచం నానాటికీ పెద్దదవుతూనే ఉంది. అద్భుతంగా ఫీలయ్యాం. అందుకే ముందటి కంటే ఇప్పుడు రెట్టింపు ఉత్సాహం పెరిగింది.

అయితే, నిడివి పెరగకూడదని చెప్పి ఒక్క సీన్, ఒక్క డైలాగ్ కూడా తీసేయలేమని ఎడిటర్ సహా అందరం భావిస్తున్నాం. ఇంత భారీ కథను, బలమైన పాత్రలను, భావోద్వేగాలను ఎస్టాబ్లిష్ చేయాలంటే సరైన టైమ్ తీసుకోవాలని అనుకున్నాం. దేవర సినిమాను రెండు భాగాలు చెప్పడం కరెక్ట్ అనిపించింది. అందుకే, ఏమైనా సరే దేవర సినిమాను రెండు భాగాలు చేయాలని ఫీలయ్యాం. మొన్నే ఆ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఆ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. ఏప్రిల్ 5వ తేదీ (2024) దేవర పార్ట్-1 రిలీజ్ అవుతుంది.” అని కొరటాల శివ చెప్పారు.

దేవర సినిమాలో ప్రకాశ్ రాజ్, జిస్సు సెంగుప్త, శ్రీకాంత్, టామ్ చాకో, నరైన్, మురళీ శర్మ కీలకపాత్రలు చేస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండ‌గా.. యువ సుధ ఆర్ట్స్, ఎన్‍టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍

Advertisement

తాజా వార్తలు

Advertisement