Saturday, September 7, 2024

KA Teaser | కిరణ్ అబ్బవరం పాన్ ఇండియన్ మూవీ.. ‘క’ టీజర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ అప్‌కమింగ్ పాన్ ఇండియన్ మూవీ ‘క’. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి మెప్పించిన కిరణ్… ఆ తరువాత ఒక్కో సినిమాతో మంచి విజయం సాధిస్తూ క్రేజ్ ను సొంతం చేసుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు సుజీత్, సందీప్ దర్శక ద్వయం రూపొందిస్తున్న ‘కా’ మూవీతో తొలిసారిగా పాన్ ఇండియన్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈరోజు కిరణ్ పుట్టినరోజు సందర్భంగా తాజా చిత్రం ‘క’ టీజర్‌ను విడుదల చేశారు.

YouTube video

మాస్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా టీజర్ లో కిరణ్ యాక్టింగ్, డిఫరెంట్ స్టైల్ బాగున్నాయి. ఒక పోస్ట్ మ్యాన్ గా పనిచేసే వ్యక్తి పలు హత్యలు చేస్తుండడం, అసలు అతను ఎవరు, ఆ హత్యలు ఏంటి, ఆపై కథేంటి వంటి అంశాలపై ఇంట్రెస్టింగ్ గా ఈ టీజర్ రూపొందింది. ఇప్పటికే ఈ అప్‌కమింగ్ పాన్ ఇండియన్ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. కిరణ్ అబ్బవరం సొంత బ్యానర్ పై దీనిని చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement