ఆరు పదుల వయసు మీద పడుతున్నా యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు అక్కినేని నాగార్జున. ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు నాగార్జున కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ బంగార్రాజు కూడా పట్టాలెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలాసార్లు రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం బంగార్రాజు సినిమా జూలైలో ఆరంభించబోతున్నారట. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఈసారి మాత్రం జూలై లో షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారట దర్శకుడు. ఇక ఈ సినిమాలో కూడా నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించనుంది.