ఇండస్ట్రీలో అడుగు పెట్టి 18 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఫుల్ జోష్ లో ఉంది సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొడుతోంది. తాజాగా నయనతార పేషన్ స్టూడియోస్ వారితో రెండు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుంది. అభిషేక్ పిక్చర్స్ తో కలిసి పేషన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించనున్నారు.
అయితే అందులో మొదటి ప్రాజెక్టును ఓ నూతన దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నాడు. కాగా ఇందులో నయనతార కు దీటుగా విలన్ పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుదీప్ చాలా సినిమాల్లో విలన్ పాత్ర పోషించి మెప్పించాడు. కథ లో సుదీప్ పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఖచ్చితంగా ఆయన ఈ సినిమా కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి సుదీప్ అందుకు ఒప్పుకుంటారో లేదో.