అతిలోక సుందరి శ్రీదేవి రెండో కుమార్తె, జాన్వీ కపూర్ సోదరి ఖుషి కపూర్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు ఒప్పుకుంది. పాత వీడియోని ప్రదర్శిస్తూ దానిపై ఆరా తీసిన నెటిజన్‌తో ఇన్‌స్టాలో ఖుషీ తన సినిమా అరంగేట్రం చేయడానికి ముందు ముక్కు, పెదవుల (లిప్ ఫిల్లర్స్)ను శస్త్ర చికిత్సతో సరి చేయించుకున్నట్టు వెల్లడించింది.
ఈ వీడియోలో ఖుషి తన తల్లి శ్రీదేవితో కలిసి ఒక ఈవెంట్‌కు హాజరైంది. అప్పటికి తను చిన్నపిల్ల… కానీ ఇప్పుడు టీనేజీ అమ్మాయి. తన మొదటి ఓటీటీ చిత్రం ది ఆర్చీస్ ప్రీమియర్ తో ఎంట్రీ ఇచ్చిన సమయంలో వీడియో అది. ఖుషి పాత రూపం గురించి ఒక నెటిజన్ ప్రశ్నించాడు. దానికి వెంటనే ప్రతిస్పందనగా ఖుషీ ఈ ప్రక్రియ నిజమేనని సింపుల్ వ్యాఖ్యతో ధృవీకరించింది.
ఈమోజీలతో అది నిజమేనంటూ ఖుషి కపూర్ సింపుల్ గా అంగీకరించడం నిజానికి నెటిజన్‌కు షాక్ నిచ్చింది. చాలా మంది నెటిజనులు ఖుషి నిజాయితీని మెచ్చుకున్నారు. మరోవైపు అక్క జాన్వీ బాటలోనే ఖుషి కపూర్ కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోందంటూ ప్రచారం సాగుతోంది. ఇటీవల మీడియా కథనాల ప్రకారం.. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సరసన ఆరంగేట్రం చేయడానికి చర్చలు జరుపుతోందని తెలుస్తోంది.
ఖుషి ఇప్పటికే హిందీలో ది ఆర్చీస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే రెండు హిందీ చిత్రాల్లోను నటిస్తోంది. తదుపరి టాలీవుడ్ ఎంట్రీపై పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది. మరోవైపు ఖుషి కపూర్ సోషల్ మీడియా క్వీన్ గా, మ్యాగజైన్ కవర్ గాళ్‌గా యువతరంలో గిలిగింతలు పెడుతోంది. వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది.