తమిళ స్టార్ హీరో కార్తి నటించిన చిత్రం ఖైదీ. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు కార్తి, దర్శకుడు లోకేశ్. అందుకు సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టారు. అయితే ఈ కథ తనదేనంటూ ఒక వ్యక్తి కోర్టుకు వెళ్లడం వలన, ‘ఖైదీ’ సినిమా రీమేక్ లకు .. సీక్వెల్ కి బ్రేక్ పడింది. ఈ విషయం ఎప్పుడు తేలుతుందోనని చాలామంది అనుకున్నారు. ఈ క్రమంలో, ఈ కథ ఒరిజినల్ లోకేశ్ రాసుకున్నదేనని కోర్టు నుంచి ఆయనకి అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో ఈ సినిమా టీమ్ ఫుల్ ఖుషీ అవుతోందట. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ మొదలవుతుందని అంటున్నారు. మొదటిభాగం ఎక్కడైతే ఆగిందో .. అక్కడి నుంచే సీక్వెల్ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. కార్తి అభిమానులకు ఇది శుభవార్త అనే చెప్పాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement