Tuesday, November 26, 2024

కేజిఎఫ్ న‌టి.. మాళ‌విక అవినాష్ కి తీవ్ర అస్వ‌స్థ‌త‌

తీవ్ర అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యారు కేజిఎఫ్ నటి మాళవిక అవినాష్ . ఈ మేరకు ఆసుప త్రి బెడ్ పై చికిత్స తీసుకుంటున్న ఫోటోను మాళవిక అవినాష్.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మీలో ఎవరైనా మైగ్రేన్ సమస్య ఉంటే తేలిగ్గా తీసుకోకూడదని మాళవిక అవినాష్ ఈ సందర్భంగా తెలిపారు.పనాడోల్స్ మరియు నెప్రోసిన్ లాంటి మందులతో పాటు… ప్రకృతి రీత్యా సంప్రదాయ ఔషధాలను కూడా వాడాలని ఆమె కోరారు. తలనొప్పే కదా అని వదిలేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. ఒకవేళ దీనిని లైట్ గా తీసుకుంటే నాలాగే ఆసుపత్రిపాలు కావాల్సి ఉంటుందని ఆమె వివరించారు. కాగా ప్రస్తుతం మాళవిక అవినాష్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆమె హెల్త్ బులిటెన్ సాయంత్రం రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement