రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ సినిమా విడుదలను హైకోర్టు సింగిల్ బెంచ్ రిజర్వ్ చేసింది. దీంతో డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు రాంగోపాల్ వర్మ. కాగా, వ్యూహం సినిమా పై ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నెల 9వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు ఆదేషాలు జారీ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ బుధ, గురువారాల్లో వాదనలు కొనసాగాయి. తాజాగా సోమవారం ఇరువర్గాల వాదనలు పూర్తి చేసింది.
వ్యూహం సినిమాను రాజకీయ నాయకులను కించపరిచేలా నిర్మించారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సింగిల్ జడ్జి ‘వ్యూహం’ సినిమాకు సెన్సారు బోర్డు (సీబీఎఫ్సీ) ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేస్తూ జనవరి 22న తీర్పు ఇచ్చింది.