తనకి కాబోయే భార్యని పరిచయం చేశాడు కమెడియన్ కెవ్వు కార్తీక్.. రెండు రోజుల క్రితం కార్తీక్ ఒక అమ్మాయితో ఉన్న ఫోటోలు షేర్ చేశాడు. అయితే ఆ అమ్మాయి ముఖం చూపించలేదు. అయితే తాను వివాహం చేసుకోబోయే అమ్మాయి ఈమె అని హింట్ ఇచ్చాడు. నేడు ఆ అమ్మాయిని పరిచయం చేశాడు. ఆమె ముఖాన్ని అభిమానులకు పరిచయం చేశాడు. ఓ రొమాంటిక్ కోట్ కూడా షేర్ చేశాడు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటే ఏమిటో తెలియలేదు. అది ఇప్పుడు అర్థం అవుతుంది. ఫైనల్లీ ఆమె ఈమెనే. నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. లవ్ యూ సిరి అంటూ రాసుకొచ్చాడు.కెవ్వు కార్తీక్ కి కాబోయే భార్య చాలా అందంగా ఉంది. నెటిజెన్స్ మీ జంట బాగుందని కామెంట్ చేస్తున్నారు. కెవ్వు కార్తీక్ సందేశం ప్రకారం ఆమె పేరు సిరి. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement