డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కేతికా శర్మ. ఆ తర్వాత లక్ష్యం, బ్రో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. మూడేళ్ల కిందట టాలీవుడ్‌కి వచ్చిన ఈ అమ్మడు మెల్లమెల్లగా బిజీ అయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ తెలుగు సంప్రదాయాన్ని బాగా ఫాలో అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… యూత్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా వైట్ శారీతో పర్ఫెక్ట్ ఫోటోషూట్ ఇచ్చింది.