నటి కీర్తి సురేష్ డిసెంబర్‌లో ఆంటోనీ థట్టిల్‌ని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ ఇటీవల తనకు కాబోయే భర్త, ఆంటోనీ థట్టిల్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమది, 15 సంవత్సరాల బంధం అని వెల్లడించారు. కాగా, తాజాగా వీరి పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డు ప్రకారం, నటి కీర్తి సురేష్ – ఆంటోనీ థట్టిల్ డిసెంబర్ 12న వివాహం బంధంతో ఒక్కటవ్వబోతున్నారు. కీర్తి సురేష్ పెళ్లి విషయం తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.