Sunday, November 24, 2024

keerthy Suresh | గ్లామ‌ర్ డోస్ పెంచేస్తున్న కీర్తీ…

కీర్తీ సురేష్ ఆన్ స్క్రీన్ పై గ్లామ‌ర్ డోస్ పెంచిన సంగ‌తి తెలిసిందే. ఆఫ్ ది స్క్రీన్ మాత్రం అమ్మ‌డు రూల్స్ ఎక్క‌డా బ్రేక్ చేయ‌డం లేదు. ఫ‌రిది దాటి గ్లామ‌ర్ షో చేస్తున్న‌ట్లు ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా దొరక‌లేదు. నెట్టింట షేర్ చేసే ఫోటోల్లో త‌న క‌ట్టుబాట్ల‌ను మాత్రం తూచ త‌ప్ప‌కుండా పాటిస్తూనే ఉంది. అందాలు క‌నిపించే డ్రెస్‌లకంటే… డ్రెస్ సెన్స్‌తొనే అందం తీసుకొచ్చే పాల‌సీతో ముందుకెళ్తుంది. ఆఫ్ ది స్క్రీన్ లో స్కిన్ షో… క్లీవేజ్ షో వంటి వాటికి తొలి నుంచి దూరంగానే ఉంది. ఇప్ప‌టికీ అదే కండీష‌న్ తో ముందుకెళ్తోంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా అమ్మ‌డు వైట్ డిజైన్ సారీలో త‌ళుకులీనిన వైనం నెట్టింట చ‌ర్చ‌కొచ్చింది. అమ్మ‌డి పెద‌విల‌పై అంద‌మైన న‌వ్వు తన గ్లామ‌ర్ కు మ‌రింత బ్యూటీని తీసుకొచ్చింది. ఇది కీర్తి మార్క్ అప్పిరియ‌న్స్ అనిపించింది. వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఒక్కో భంగిమ‌ని ఉద్దేశించి నెటి జ‌నులు కామెంట్లు పెడు తున్నారు. లుక్స్ గార్జియ‌స్, ఎడోరబుల్, క్యూటీ బంగారం, సూప‌ర్ హాట సెన్షేష‌న్ అంటూ పోస్టులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement