బాలీవుడ్ జీరో సైజ్ బ్యూటీ కరీనా కపూర్ రాసిన ప్రెగ్నెన్సీ బైబిల్ పుస్తకం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ప్రెగ్నెన్సీ బైబిల్ పేరుతో ఆమె ఒక పుస్తకం రాసి శుక్రవారం కవర్ పేజీని లాంచ్ చేయగా.. అది అమెజాన్లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతోంది. ఆ పుస్తకం కోసం ఇప్పుడు భారీగా ఆర్డర్ల వర్షం కురుస్తున్నది. దాంతో సేల్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే భారీగా ఆర్డర్లు సాధించిన పుస్తకంగా ప్రెగ్నెన్సీ బైబిల్ నిలిచింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన కరీనా కపూర్.. నటిగా టాప్ లెవల్లో ఉన్న సమయంలో గర్భధారణ, ప్రసవం తన మీద చూపిన ఒత్తిడి ఇతర రంగాల్లో స్త్రీలకు కూడా సహజమేనని గ్రహించింది. అందుకే గర్భధారణ నుంచి ప్రసవం వరకు స్త్రీలలో కలిగే సవాలక్ష సందేహాలకు తాను పొందిన జవాబులను అందరికీ చెప్పాలని భావించింది. అందుకోసం ఏకంగా ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో ఒక పుస్తకం రాసి విడుదల చేసింది. కాబోయే తల్లులకు ఈ పుస్తకం కచ్చితంగా ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నది.
ఇది కూడా చదవండి: చరణ్ కంటే దర్శకుడికి పది కోట్లు ఎక్కువట?