Friday, September 6, 2024

Kannappa movie – శివుడిగా ప్ర‌భాస్…

మంచు విష్ణు నటిస్తున్న హిస్టారికల్ సోషియో ఫాంటసీ మూవీ ‘కన్నప్ప’. మధుబాల, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్.. వంటి భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నారని సమాచారం. పార్వతి పాత్రలో నయనతార నటించబోతుంది.
ఈ మూవీకి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ని ఇటీవలే న్యూజిలాండ్ లో పూర్తి చేసుకొని వచ్చారు. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన షాట్స్ ని చిత్రీకరిస్తునట్లు సమాచారం. ఈక్రమంలోనే కైలాసంలోని శివపార్వతికి సంబంధించిన షాట్స్‌ని, అలాగే క్లైమాక్స్ కి సంబంధించిన సీన్స్ ని చిత్రీకరించడానికి సిద్దమయ్యారట. దీంతో శివుడిగా తన పాత్రని పూర్తి చేయడానికి ప్రభాస్.. ఒక మూడు రోజుల కాల్ షీట్స్ ని ఇచ్చారంట.
ఫిబ్రవరి 17-19 తేదీలలో ప్రభాస్ ఈ మూవీ సెట్స్ లో పాల్గొని.. తనకి సంబంధించిన సన్నివేశాలని పూర్తి చేయబోతున్నారట. మరి అందరూ అనుకుంటున్నట్లు ప్రభాస్.. నిజంగానే శివుడి పాత్రలో కనిపించబోతున్నారా అనేది చూడాలి. కాగా ఈ సినిమాలో మంచు విష్ణుకి హీరోయిన్ గా ప్రీతీ ముఖుంధన్ నటిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement