నాలుగు రోజుల కిందట బిగ్ బాస్ కంటెస్టెంట్ కన్నడ నటి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. కోలార్ లోని తన ఇంట్లో చైత్ర ఫినాయిల్ తాగి బలవన్మరణానికి పాల్పడింది. దీనితో కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు తాజాగా వైద్యులు ప్రకటించారు. కాగా ఆత్మహత్యకు కారణాలు మాత్రం తెలియరాలేదు.
చైత్ర గత నెల 28న నాగార్జున అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే వివాహమైన మూడు రోజులకే చైత్ర కు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. వివాహానికి చట్టబద్ధత లేదంటూ నాగార్జున కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. ఈ నేపథ్యంలోనే మనస్తాపం చెంది ఆత్మహత్యయత్నం చేసినట్లు తెలుస్తుంది.