బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోస్టు తెగ వైరల్ అవుతోంది. ‘ధక్కడ్’ వర్కింగ్ స్టిల్ ని కంగనా షేర్ చేయగా… అందరి దృష్టి ఆమె హెయిర్ స్టైల్ పైన పడింది. షార్ప్ బాబ్ హెయిర్ కట్ తో మిస్ రనౌత్ డిఫరెంట్ గా కనిపించింది. తన సినిమాలతో కంటే కాంట్రవర్సీలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్. స్తుతం యూరప్ లోని బుడాపెస్ట్ లో ఉన్న కంగనా అక్కడ ‘ధక్కడ్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. అదీ నైట్ షిఫ్ట్ లో నిద్ర మానుకుని బాగా కష్టపడుతోంది. ఇన్ స్టాలో తను షేర్ చేసిన స్టోరీ ఇప్పుడు చాలా మందిని ఆకట్టుకుంటోంది.
‘ధక్కడ్’ సినిమాలో కంగనా ‘ఏజెంట్ అగ్ని’గా యాక్షన్ రోల్ లో కనిపించనుంది. గతంలో మధ్యప్రదేశ్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసిన ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు బుడాపెస్ట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నైట్ షిఫ్ట్ లో యాక్షన్ సీక్వెన్స్ చేయాల్సి వస్తోంది కంగనాకి! అందుకే, ఆమె పోస్ట్ చేసిన ఈజీ స్టోరీలో కూడా నిర్మాత షోహైల్ మక్లైని “ఇన్ని నైట్ షిఫ్ట్స్ ఎందుకు చేయిస్తావు?” అని అడుగుతోంది!.. ఇక త్వరలో ‘తలైవి’గా రానున్న ‘క్వీన్’ ఆఫ్ బాలీవుడ్ ‘ధక్కడ్’లో ఎలా అలరిస్తుందో? ‘తేజస్, మణికర్ణిక రిటర్న్స్’ లాంటి అవెయిటెడ్ సినిమాలు కూడా కంగనా ఖాతాలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Twitter: ఇకపై లాగిన్ మరింత సులభతరం..