బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అంధేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కంగనాపై పరువు నష్టం కేసు విచారణ మొదలుపెట్టింది. ఆ కేసును కంగనా సవాల్ చేసింది. ఆమె తరపు రిజ్వాన్ సిద్ధికీ వాదించారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జావెద్ అక్తర్‌పై నటి కంగనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటనలో జావెద్ అక్తర్ .. క్రిమినల్ ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో విచారణ ప్రారంభించిన జూహూ పోలీసులు ఫిబ్రవరిలో ఆమెకు సమన్లు జారీ చేశారు. గేయ రచయిత జావెద్ అక్తర్ వేసిన పరువు నష్టం కేసులో పిటిషన్‌ను కొట్టి వేయాలని కంగనా కోరినా..ఆమె అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. హైకోర్టు జడ్జి జస్టిస్ రేవతి మోహితే దేరే ఈ కేసులో విచారణ చేపట్టారు. సెప్టెంబర్ ఒకటిన తన ఆదేశాలను రిజర్వ్‌లో ఉంచారు. అయితే ఆ కేసులో కంగనా పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ఇవాళ జస్టిస్ రేవతి తెలిపారు.
ఇది కూడా చదవండి: RGV తో అషురెడ్డి బోల్డ్ ఇంటర్వ్యూపై ఆమె తల్లి రియాక్షన్..