Saturday, June 29, 2024

Kalki 2898AD | క‌ల్కి రెండు రోజుల క‌లెక్ష‌న్స్ ఎంతంటే…

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం కల్కి 2898AD… పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 27న (గురువారం) రిలీజ్ అయిన ఈ మూవీ… రెండు రోజుల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా 298.5 కోట్ల గ్రాస్‌ను వ‌సూలు చేసింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం తెలియ‌జేసింది. మొద‌టి రోజు (గురువారం ) ఈ మూవీ 191.5 కోట్లు క‌లెక్ట్ చేసింది.

సైన్స్ ఫిక్షన్‌తో పౌరాణిక కథలను మేళవించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అదిరిపోయే యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో తెర‌కెక్కిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఓవరాల్ గా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement