Thursday, October 24, 2024

Kalki 2898 AD | రూ.100కే ‘కల్కి’ టికెట్‌..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ కల్కి 2898AD. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. దాదాపు 1100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

కాగా, తాజాగా చిత్ర యూనిట్ ఓ అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా అన్ని థియేట‌ర్ల‌లో కల్కి మూవీని రూ.100 కే చూడొచ్చున‌ని ప్ర‌క‌టించింది. ఇక ఈ ఆఫ‌ర్ ఆగ‌స్టు 2 నుంచి 9 వ‌ర‌కు మాత్ర‌మే వ‌ర్తించ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement