Sunday, October 6, 2024

Kalki 2898 AD | వెయ్యి కోట్లకు చేరువలో క‌ల్కి….

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ కళ్లు చెదిరే కలెక్షన్లతో దూసుకుపోతూ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సెన్సేష‌న‌ల్ మూవీ గ్లోబ‌ల్ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతోంది. ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉండడంతో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

‘కల్కి’ సినిమా విడుదలై నేటికి 11 రోజులైంది. కాగా, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.950 కోట్లకు పైగా వసూలు రాబ‌ట్టి వెయ్యి కోట్ల వైపు దూసుకుపోతుంది. ప్ర‌భాస్ తో పాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని సి.అశ్విని దత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

నైజాంలో అగని కలెక్షన్లు…

క‌ల్కి 2898 AD టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గ‌ర్ ఏమాత్రం స్లో అవ‌డం లేదు. నైజాం ఏరియాలో క‌ల్కి మూవీ వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఆదివారం నాటికి జీఎస్టీతో క‌లుపుకుని రూ.80 కోట్ల మేర వ‌సూళ్లు సాధించింది. జూలై 12న భార‌తీయుడు-2 సినిమా రిలీజ్ అవుతుండ‌టంతో ఆలోపే వంద కోట్ల మార్క్ దాటేస్తుంద‌ని సినీ ఎక్స్ ప‌ర్ట్స్ అంటున్నారు.

బుక్ మై షోలో సెన్సేష‌న‌ల్ రికార్డు..

- Advertisement -

పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ‘కల్కి’…. ప్రముఖ టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షోలో అరుదైన ఫీట్‌ను నమోదు చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఏకంగా కోటికి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు బుక్ మై షో వెల్లడించింది. అన్ని భాషల్లో కలిపి 103.28 లక్షల కల్కి టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు బుక్ మై షో ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement